పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణం 10 వ వార్డు గుర్రాలచావిడి లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని ఇంటింటా పర్యటించారు. ఈ మూడున్నరేళ్లలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఆయన ప్రచారం చేశారు. అనతికాలంలోనే వైయస్ జగన్ 98 శాతం హామీలు అమలు చేసి దేశానికే దిక్సూచిగా నిలిచారని ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. ప్రజల దగ్గరకు వెళ్లే వారు ధైర్యంగా, గర్వంగా వెళ్లాలి. ఆ స్థాయిలో సీఎం వైయస్ జగన్ మమ్మల్ని నిలబెట్టారన్నారు.