పేదలందరికీ జగనన్న ఇళ్లు పథకం కింద అభివృద్ధి చేస్తున్న వైయస్ఆర్ జగనన్న కాలనీలు తాజాగా తెలుగుదేశం నాయకుల విమర్శలకు ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల హామీల్లో ఒకటైన ఈ గృహనిర్మాణ కార్యక్రమం గత రెండేళ్లుగా చక్కగా సాగుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ గృహాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయి. సొంతిల్లు ఉండాలనే జనం కోర్కెను జగనన్న కాలనీలు తీర్చుతున్నాయి. తప్పుడు ప్రచారాలు తగదు అని హెచ్చరించారు.