తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పట్ల ప్రవర్తించిన తీరు..మాట్లాడిన మాటలు చాలా క్షమించరానివని ఆయన తీరు అత్యంత గర్హనీయమని వైయస్ఆర్సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ పట్ల జేసీ ప్రవర్తించిన తీరు చాలా దుర్మార్గమని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు .జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాటలను వెంటనే వెనక్కి తీసుకుని కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య బద్దంగా సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అయితే అక్కడ కూడా వాటికి పరిష్కారం రాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అంతేకాని అధికారులను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నా ఆలోచనలతో బెదిరింపులకు ఇలా దిగడం దుర్మార్గం అన్నారు.జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి చాలా మంచిపేరు తెచ్చుకున్నారని విధి నిర్వహణలో ప్రజలకు మంచి సేవలు అందించి ప్రజల మన్ననలను పొందారన్నారు.