వచ్చే ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023 ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ సమ్మిట్ కు సంబంధించి దేశంలోని పలు ప్రముఖమైన నగరాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో యు.ఎస్.ఏ., యూ.కె., జర్మనీ, ఇజ్రాయిల్, తైవాన్, దక్షిణ కొరియా తదితర ప్రధాన దేశాల్లో రోడ్ షోలను నిర్వహించేందుకు చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పటికీ, వారి సూచనల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతంగా పలు పరిశ్రమలను నడుపుతున్న వారినే ఈ సమ్మిట్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉపయోగించుకోనున్నట్లు మంత్రి తెలిపారు.