నంద్యాల జిల్లా, పాములపాడులో న్యూడ్ కాల్స్ కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది మహిళలకు న్యూడ్ కాల్స్ చేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి విషయాలపై బాధితులు తమకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు అగంతకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. డ్యాన్సులు వేస్తూ.. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అయితే ఆ కాల్స్‌ను కట్ చేసినా.. మళ్లీ ఫోన్ చేసి బూతులు తిట్టడంపై బాధిత మహిళలు బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు. అయినా అగంతకుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో ఎట్టకేలకు బాధిత మహిళలు ధైర్యంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే అగంతకులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఎస్ఐ అశోక్ అన్నారు.