ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటనలో తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మోదీ పర్యటన సందర్భంగా ఇదే అజెండా అని.. వేరే అజండా ఏమీ లేదని అన్నారు. ఇవి కాకుండా.. ఎవరు ఏమైనా ప్రచారం చేసుకుంటే తమకు సంబంధం లేదన్నారు. రైల్వే జోన్ శంకుస్థాపన ఈ రోజు వరకు లేదని, అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే ప్రధాని వస్తున్నారని స్పష్టం చేశారు. చిన్న చిన్న విషయాలను రాజకీయం చేయొద్దన్నారు. అభివృద్ధి అజెండాగానే ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని జీవీఎల్ స్పష్టం చేశారు.