వామపక్ష పార్టీల నేతలు బుధవారం ఉదయం విజయవాడలో సమావేశం అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని ఈనెల 11, 12 తేదీల్లో ఏపీ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. మోదీ ఏపీని అన్నివిధాల మోసం చేసి, సిగ్గు లేకుండా వస్తున్నారని విమర్శించారు. ఒక్క అంశంలో అయినా ఏపీకి న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ కూడా అధికార యంత్రాంగాన్ని ప్రధాని పర్యటనకు వినియోగిస్తున్నారని, వేల కోట్లతో ప్లీనరీ సమావేశం తరహాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.