ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయం గెలుస్తుంది అంటున్న అయ్యన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 03:29 PM

టీడీపీ నాయకులూ  అయ్యన్నపాత్రుడి కి ఏపీ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. పది సంవత్సరాల పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని కీలక తీర్పును హైకోర్టు వెలువరించింది. ప్రాథమిక అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని కోర్టు చెప్పింది. జలవనరుల శాఖ అధికారులు ఇచ్చిన ఎన్‌ఓసీ.. విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారం నడుచుకోవాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‌పీసీలోని 41 ఏ కింద అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. సిఐడీ విచారణ జరుపుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. అయ్యన్నపాత్రుడిపై సిఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరుపు న్యాయవాది వీవీ సతీష్‌ హైకోర్టును ఆశ్రయించారు. గత వారం ప్రభుత్వం, అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాదుల వాదనలను విన్న అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ రోజు అయ్యన్నపాత్రుడి కేసులో ఐపీసీలోని సెక్షన్ 467 వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com