ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ బుధవారం సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఫేస్‌బుక్‌లో పనిచేస్తున్న 13 శాతం మంది ఉద్యోగులు... అంటే సుమారు 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఫేస్‌బుక్ ప్రారంభించిన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇది తనకు అత్యంత కష్టతరమైన నిర్ణయమని, అయితే కంపెనీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జుకర్‌బర్గ్ అన్నారు.