ముంబై పోలీసు శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 30 రోజులపాటు డ్రోన్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగరవేయడాన్ని నిషేధించింది. సెక్షన్ 144 కింద పోలీసులు బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్రవాదులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు డ్రోన్లు ఉపయోగించే అవకాశం ఉన్నందున ఈ నిబంధన అమలు చేశామని పోలీసులు తెలిపారు. ఈ నిబంధనలు నవంబర్ 13 నుండి డిసెంబర్ 12 వరకు అమల్లో ఉండనున్నాయి.