చంద్రబాబుకు జీవితకాలం సమయం ఇస్తున్నాం.. పులివెందుల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ అయినా గెలవగలడా..? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తాడన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలని ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత పవన్ జెండా పీక్కొని పారిపోతాడన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ దెబ్బకు చంద్రబాబు, పవన్, లోకేష్ రాజకీయ అనాథలుగా మిగిలారన్నారు. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అంకితం చేశాడన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేకనే ఇప్పటంపై విపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.