టీడీపీ-జనసేన-ఎల్లో మీడియా కుట్రలకు సంబంధించి రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అప్పుడూ, ఇప్పుడూ టీడీపీ-ఎల్లో మీడియావి అదే మాయ..!అప్పుడు లేనిది ఉన్నట్టు.. ఇప్పుడు ఉన్నది లేనట్టు..! చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెయిడ్ ఆర్టిస్టులు.. పెయిడ్ పార్టీలు.. పెయిడ్ గ్రూపులతో బాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో ఏం జరిగింది.. వైయస్ జగన్ గారి పాలనలో ఏం జరుగుతుందో ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.