దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో నేత సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో 31 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించామని, ఫేస్–1, ఫేస్–2 కింద 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే రామోజీరావుకు కళ్లు కనిపించడం లేదా..? అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. పేదల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే.. ప్రభుత్వంపై బురదజల్లేలా ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, పేదల ఇళ్లపై రామోజీరావుకు ఎందుకంత కడుపుమంట..? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.