బంగారుపాళ్యం అర్బన్ పోలీస్ స్టేషన్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ వై. రిశాంత్ రెడ్డి శుక్రవారం అకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్భంగా
బంగారుపాళ్యం అర్బన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సమీక్షించారు. మహిళా పోలీసులు, వలంటీర్లను వినియోగించి గ్రామాల్లోని ఇంటింటికి పంపి మహిళా నేరాలు జరిగే వీలున్న సమాచారం సేకరించడం, ఫోక్సో, ఛీటింగ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.