సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టులో తట్టు ప్రాంతంలో బాతు పిల్లల మరణాలు ఆగడం లేదు. మంగళవారం నుంచి బాతు పిల్లలు చనిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజు వంద పిల్లలు చని పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం సైతం మరణాలు కొనసాగాయి. మొత్తంగా ఇప్పటి వరకు 2వేల పిల్లలు చనిపోయాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి ఏమిటో అంతుబట్టడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa