జగనన్న బుహక్కు భూ రక్షా పథకం కింద రీ సర్వేకు సంబంధించి డ్రాఫ్ట్ పబ్లికేషన్, వెరిఫికేషన్ పూర్తయిన గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీకి సిద్ధంగా వుండాలని భూ పరిపాలనా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ గురువారం విజయవాడలోని తన కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, జేసి నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు.