దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 986 పాయింట్లు లాభపడి 61,600 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 280 పాయింట్ల లాభంతో 18,309 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.80.69 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి.