ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ రిజర్వేషన్ కోటాను 60 శాతం నుంచి 77 శాతానికి పెంచుతూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు శుక్రవారం ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. రిజర్వేషన్ల పెంపునకు వీలుగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో మార్పులు చేయాలని బిల్లులో పేర్కొన్నారు.