సెల్ టవర్ ను పార్టులుగా విడదీసి ఎత్తుకెల్లిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. జీటీఎల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ వాలూజ్ లో 2009లో కొంత స్థలాన్ని పదేళ్ల పాటు లీజుకు తీసుకుని, అందులో ఈ టవర్ ను ఏర్పాటు చేసింది. పదేళ్ల గడువు పూర్తికాకముందే 2018లో సదరు భూమి యజమాని జీటీఎల్ కంపెనీని ఖాళీ చేయించాడు. ఇటీవల కంపెనీ ప్రతినిధి ఆ స్థలాన్ని పరిశీలించగా టవర్ కనిపించలేదు. రూ. 35 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.