జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి పీఎస్ లో కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ కారు టాప్ పైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించారని, ర్యాష్ డ్రైవింగ్ చేశారని, పవన్ వల్ల తనకు బైక్ యాక్సిడెంట్ జరిగిందని శివకుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఐపీసీ 336, రెడ్ విత్ 177ఎంవీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 5న ఇప్పటం పర్యటనకు వెళ్తున్న సమయంలో పోలీసులు తనను ఆపే ప్రయత్నం చేయడంతో పవన్ కళ్యాణ్ కారు పైకి ఎక్కి ప్రయాణించిన విషయం తెలిసిందే.