ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఆ రిజర్వేషన్లను సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పడాన్ని స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.