ఇంటికి దొంగతనానికి వచ్చిన దుండగులు భర్తను బంధించి అతడి కళ్ల ముందే భార్యను అత్యాచారం చేశారు. ఈ దారుణం రాజస్థాన్లోని సీరోహీలో జరిగింది. భయంతో రెండు రోజుల పాటు బాధితురాలు బయటకు రాలేదు. అనంతరం పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.