మధ్యప్రదేశ్ గ్వాలియర్లో దారుణం జరిగింది. సుభాశ్ శక్యా అనే వ్యక్తి పొగాకు కొని డబ్బులివ్వకుండా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో షాప్ ఓనర్ కరణ్ యాదవ్, అతడి కుమారుడు సచిన్ శక్యాను పట్టుకొని పిడిగుద్దులతో దాడి చేశారు. దీంతో శక్యా అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.