పద్యకవిగా పాలా వెంకటసుబ్బయ్య, అవధానిగా సి. పి. సుబ్బన్న రాయలసీమ కీర్తిపతాకలని, వారి సాహితీకృషి గొప్పదని సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు మూల మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో శనివారం సాయంత్రం ప్రసిద్ధ పద్యకవి పాలా వెంకటసుబ్బయ్య 110వ జయంతి, ప్రసిద్ధ అవధాని సి. వి. సుబ్బన్న 94వ జయంతి కార్యక్రమం నిర్వహించబడిరది.
ఈ కార్యక్రమంలో సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు మూల మల్లికార్జునరెడ్డి, పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి ముందుగా పాలా వెంకటసుబ్బయ్య, సి. వి. సుబ్బన్న చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా. మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ పాలా వెంకటసుబ్బయ్య అనేక పద్యకావ్యాలు, నాటకాలు, నాటికలు, నవలలు, కథలు, ఆంగ్లరచనలు చేశారని అన్నారు. వెంకటసుబ్బయ్య వేదం వెంకటకృష్ణశర్మ శిష్యుడని, కోడూరు శాసనసభ్యులుగా, శ్రీశైల ప్రభ పత్రిక సంపాదకులుగా సేవలందించారని అన్నారు. రాయలసీమ కరువును ఇతివృత్తంగా చేసుకొని అనిలసందేశం అనే కావ్యం రచించారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa