దువ్వూరు మండలం లోని నీలపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలపురం నుండి ఎస్టీ కాలనీ వరకు ఉన్న రహదారిని శనివారం పంచాయతీరాజ్ యస్. ఈ శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నేషనల్ హెల్త్ యస్టి కమిషన్ వారి ఆదేశాలతో ఈ రహదారిని తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. ఈ రహదారి లో ఉన్న వంక కు కల్వర్టు నిర్మించుటకు అంచనా వేసి ఉన్నత అధికారులకు నివేదిక పంపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామయ్య, శివ శంకర్ రెడ్డి, ఏఈ పీఆర్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa