బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పలు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశాఖలో ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. వచ్చే జనవరిలో విశాఖపట్నంలో ఈ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఇంటర్నెట్ వేగం, నాణ్యత పెరగడంతో పాటు చార్జీలు తగ్గుతాయని తెలిపారు. ఐటీ, ఆర్థిక, బ్యాంకింగ్ సేవలకు ఊతం లభిస్తుందని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa