ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా పరుగులు తీస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ, పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న భరోసాతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పారిశ్రామిక జిల్లాగా అనకాపల్లి అభివృద్ధి చెందుతోంది. అచ్యుతాపురం, అనకాపల్లి రాష్ట్ర ముఖచిత్రంలో పారిశ్రామిక ప్రాంతాలుగా నిలవనున్నాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పూడిలో ‘యమ రిబ్బన్ కంపెనీ’ నిర్మాణానికి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే రమణమూర్తిరాజులతో కలిసి అమర్‌నాథ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చైనాకు చెందిన యమ రిబ్బన్ కంపెనీ సుమారు రూ.300 కోట్ల వ్యయంతో 15.76 ఎకరాల్లో తమ శాఖను ఏర్పాటు చేస్తోందన్నారు.