బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలం లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వరి పంటలు నేల వాలాయి. దీంతో కోత దశలోని వరి పంట నేల వాడడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు వరి పంట పూర్తిగా నీట మునిగి రైతులు నిలువునా నష్టపోయారు. ప్రస్తుతం వర్షాలు మొదలు కావడంతో వరి సాగు చేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది.