బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. సమాజ వికాసానికి వారే పట్టుకొమ్మలు. ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి. చిన్నారులందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్లో సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.