పుత్తూరు మండలం వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని రాజేష్ నాయుడు (44) ఆదివారం రాత్రి మృతి చెందాడు. రైల్వే పోలీసులు వివరాల మేరకు వేపగుంటకు చెందిన రాజేష్ నాయుడు పరమేశ్వర మంగళం గ్రామంలో అయ్యప్ప స్వాముల వంటచేసి ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. సోమవారం ఉదయం శవాన్ని గుర్తించిన పోలీసులు పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి శవ పరీక్ష నిమిత్తం తరలించారు. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు. రేణిగుంట రైల్వే ఎస్సై రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.