దేశ చరిత్రలో తొలిసారిగా ఓ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇస్రో సహకారంతో స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ తయారు చేసిన రాకెట్ ఈ నెల 16 లేదా 18న రోదసీలోకి దూసుకుపోనుంది. విశాఖకు చెందిన నాగభరత్ దాకా, హైదరాబాద్ కు చెందిన చందన్ పవన్ కుమార్ స్కై రూట్ సంస్థను ప్రారంభించారు. వీరు రూపొందించిన విక్రమ్-ఎస్ అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్ లో అంతరిక్ష యానం మరింత సులభతరం కానుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.