బ్యాచిలర్‌గా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. "చాలా మంది సింగిల్స్ తక్కువ ఒత్తిడికి గురవుతారు. వారిపై ఆర్థిక ఒత్తిడి అసలే ఉండదు. బ్యాచ్‌లర్‌లు ఎక్కువగా వ్యాయామం చేస్తారు. ఫలితంగా వారికి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. ఒంటరి వ్యక్తులు రాత్రిపూట ఇతరుల కన్నా బాగా నిద్రపోతారు. దీంతో ఆరోగ్యప్రయోజనం కలుగుతుంది. బ్యాచ్‌లర్స్ ఎక్కువగా సంతోషంగా కూడా ఉంటారు. వారికి లక్ష్యాలపై దృష్టి పెట్టేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది." అని అండర్సన్ అనే క్లినికల్ సైకాలజిస్ట్ పేర్కొన్నారు.