అనంతపురం నగరంలోని శ్రీనివాస నగర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలములో అక్రమంగా కడుతున్న దర్గా నిర్మాణాన్ని తొలగించాలంటూ ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని బీజేపీ నాయకులూ కలవడం జరిగింది. వైసిపి నాయకులు అండదండలతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దర్గాతో మొదలయ్యి కళాశాల ప్రాంగణము లోకి వెళ్లి మసీదు నిర్మాణం చేపట్టాలనే సమాచారం ఉందని కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది.కలెక్టర్ గారు 2రోజుల లోపు అక్రమ కట్టడాన్ని తీసేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించడం జరిగింది. పార్టీ జిల్లా లీగల్ సెల్ నాయకులు పూజారి గోపాల్ రావు ,నాగార్జున గుప్త ,ఆదినారాయణ ,శ్రీకాంత్ గారి సహకారముతో చట్టపరంగా ప్రభుత్వ స్థలములో అక్రమ నిర్మాణము చేపడితే అమలు అయ్యే చట్టాల గురించి కలెక్టర్ వివరించడం జరిగింది.కార్యక్రమములో జిల్లా మహిళామోర్చ అధ్యక్షురాలు చంద్రకళ , స్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రంజిత్ ,రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు కేశవ గారు,కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజి బాబు ,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విశాల రెడ్డి ,ఎస్సి మోర్చా జిల్లా కార్యదర్శి రాజేష్ ,మండల ప్రధాన దిలీప్ ,గణేష్ , కాటమయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు .