కడప కలెక్టర్ విజయరామరాజుని ఆర్టీసీ ఛైర్మన్ ఏ. మల్లికార్జున రెడ్డి మంగళవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ కలెక్టర్ తో మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధతో పులివెందుల నూతన బస్టాండ్ నిర్మాణ పనులు చేపడుతున్నరాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరింత సహకారాన్ని అందించి రాష్ట్రంలోనే పులివెందుల బస్టాండ్ కు ప్రత్యేక గుర్తింపు ఉండేలా చూడాలని కోరుకున్నారు. అనంతరం డిసెంబర్ నెలలలో మా ఇంటి జరిగే వివాహ కార్యక్రమంలో పాల్గొనాలని ఛైర్మన్ కలెక్టర్ ను కోరారు.