గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఏరియాలో చుట్టుగుంట సెంటర్ నందు నూతనంగా నిర్మించబడుతున్న పోలీస్ అవుట్ పోస్ట్ ను ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం రాత్రి పరిశీలించారు. స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల సమస్యలను తెలియపరచడానికి, సత్వరమే చర్యలు తీసుకొనుటకు వారి సమస్యలు రిపోర్ట్ చేయుటకు చేరువగా ఈ పోలీస్ అవుట్ పోస్ట్ ఉపయోగపడుతుందని ఎస్పీ తెలియజేశారు.