చలికాలంలో పెదాలు పొడిబారుతుంటాయి. నల్లగా మారిపోయి నిర్జీవంగా కనిపిస్తాయి. అయితే నిమ్మరసం, తేనెతో పెదాలను సంరక్షించుకోవచ్చు. టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ తేనె తీసుకొని అందులో అర టీ స్పూన్ ఆముదం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. నిమ్మరసం బ్లీచ్ లా పనిచేస్తుంది. తేనె, ఆముదం చర్మానికి తేమను ఇస్తాయి. దీంతో పెదాలు చక్కటి రంగుతో, మృదువుగా మారి మెరిసిపోతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa