రెంటచింతల మండల కేంద్రంలో గత ఏడాదినరగా నిలిచిపోయిన వైఎస్ఆర్ క్లినిక్, పాలశీతలీకరణ నిర్మాణాలకు అడ్డంకులు క్లియర్ అయ్యాయి. మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చొరవతో వాగు వద్ద మంగళవారం క్లినిక్, పాలశీతలీకరణ నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు భూమిపూజ చేశారు. 5 సెంట్ల భూమిలో 17 లక్షల 50 వేలతో నిర్మాణంకానున్నట్లు పంచాయితీరాజ్ ఏఈ పాశం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ నిర్మాణాల భూమిపూజ కార్యక్రమంలో ఎంపీడీవో గౌసియా బేగం, సర్పంచ్ పూజల పుష్పావతి రామయ్య, ఉపసర్పంచ్ ఏరువా ప్రమిల భాస్కర్ రెడ్డి, ఏఈ కొత్త నరేంద్రరెడ్డి, ఈవోపీఆర్డీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.