వాహనాలకు అన్ని అనుమతులుంటేనే రోడ్డుపైకి రావాలని మోటర్ వెహికిల్ మాచర్ల ఇన్స్ఫెక్టర్ కేఎల్ రావు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని పాలువాయి జంక్షన్ నందు నిర్వహించిన వాహన తనిఖీలో ఆయన పాల్గొని, వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పత్రాలు సరిగా లేని వాహనాలను గుర్తించి, వాటికి రూ. 75 వేల అపరాధ రుసుంను బనాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వాహన యాజమానులు త్రైమాసిక పన్నులను సకాలంలో చెల్లించాలన్నారు. అలా చెల్లించని ఎడల 200 శాతం అధనంగా వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 24 న రెంటచింతలకు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బొల్తా పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ. ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్న ప్రైవేటు విద్యా సంస్థలను గుర్తించి, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి అన్ని సేవలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని, ఈ సేవలను సద్వినియోగపర్చుకోవాలని చెప్పారు. ఈ తనిఖీలో మోటర్ వెహికిల్ సిబ్బంది పాల్గొన్నారు.