కర్నూలు జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలకు సీఎం జగన్ ప్రతిరూపమని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను తెలుగుదేశం పార్టీ చేపట్టిందని వెల్లడించారు. రోడ్లపై గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం మూడు రాజధానులను కడుగుతారా? అని నిలదీశారు.