నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం మరోసారి సమర్థించుకుంది. నల్లధనం, పన్ను ఎగవేత, నకిలీ కరెన్సీ, ఉగ్రవాద సంస్థల నిధులకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న నిర్ణయమని సుప్రీంకోర్టుకు తెలిపింది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కు సమాధానంగా అఫిడవిట్ దాఖలు చేసింది. ఆర్బీఐ సూచనల మేరకు అందరినీ సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.