జీ20 సదస్సులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు కెమెరాల సాక్షిగా వాగ్వాదం జరిగింది. అయితే, ఈ సంభాషణను కెనడా ప్రధాని కార్యాలయం మీడియాకు విడుదల చేయడాన్ని జిన్ పింగ్ తప్పుబట్టారు. ఆ వివరాలు మీడియాకు ఎందుకిచ్చారని, చర్చలు జరిపే పద్ధతి ఇది కాదన్నారు. దీనికి కెనడా ప్రధాని చర్చల వివరాలు మీడియాకు ఇవ్వడం తప్పుకాదన్నారు. కెనడా అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని తప్పుబట్టారు.