డబ్బుల కోసం ఓ కొడుకు కిడ్నాప్ డ్రామా ఆడాడు. ''రూ.30 లక్షలు ఇవ్వండి. లేకుంటే మీ కొడుకుని 300 ముక్కలుగా నరికేస్తా." అని వేరే నంబర్ నుంచి తండ్రి వాట్సాప్ నంబర్‌కు సందేశాలు పంపిస్తూ బెదిరింపులకు దిగాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిందీ ఘటన. ఫోన్ నంబర్ ద్వారా కేసును విచారించగా.. కొడుకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లుగా బయటకు వచ్చింది. దీంతో కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.