ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19న అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు ఈటానగర్‌లోని డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రారంభించి, అనంతరం 600 మెగావాట్ల కమెంగ్ జలవిద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత వారణాసికి చేరుకుని అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు ‘కాశీ తమిళ సంగమం’ను ప్రారంభిస్తారు. ఈ మేరకు పీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.