ఆగ్నేయ బంగాళాఖాతం ఉత్తర అండమాన్ సముద్రాలను ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈ నెల 19 నాటికి వాయుగుండంగా బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుందని, ఆపై మూడ్రోజుల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 21న ఏపీ దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.