పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను మధ్యప్రదేశ్ అధికారులు ధ్వంసం చేశారు. ఇండోర్ లో మద్యం బాటిళ్లతో కూడిన 3600 బాక్సులను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం వివిధ కేసుల్లో వివిధ ప్రాంతాల నుండి స్వాధీనం చేసుకొని నిల్వ చేసిందని ఇండోర్ SDM అక్షయ్ సింగ్ తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 85 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.