గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులోని చెర్లోపల్లి కాలనీలో చేపట్ట నున్న అభివృద్ధి పనులకుగురువారం మున్సిపల్ చైర్ పర్సన్ డి. వన్నూర్ బి భూమిపూజ చేశారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ఆ కాలనీలో సిసి రహదారులు, తాగునీటి బోరు, మురుగు కాలువల నిర్మాణంకు రూ. 10 లక్షల నిధులు మంజూర య్యాయన్నారు. అదేవిధంగా 22 వ వార్డులోనూ అభివృద్ధి పనులకు ఆమె భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బివి. నరసారెడ్డి, డిఈ ఇంతియాజ్, ఏఈ శరత్ చంద్ర, కౌన్సిలర్ ఎం. సులోచన, వైసిపి పట్టణ కన్వీనర్ డి. హుస్సేన్ పీరా, జిల్లా నాయకులు బేడల వెంకటరాముడు, ఎం. రంగ స్వామి, నాయకులు వెంకట రాముడు, షఫీ, షరీఫ్, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.