కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మరోసారి తన వంకరబుద్ధిని బయటపెట్టుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనికి భారత్ సైతం స్ట్గ్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, విడదీయలేని భాగంగా ఉందని యూఎన్ లో భారత శాశ్వత ప్రతినిథి ప్రతీక్ మాథుర్ తెలిపారు. పాకిస్థాన్ అబద్ధాలను ప్రచారం చేసేందుకు తెగించి ప్రయత్నిస్తోందని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.