యర్రగుంట్ల పట్టణంలో స్థానిక పురపాలిక పరిధిలో గురువారం కుష్టువ్యాధి గ్రస్తులను గుర్తించే కార్యక్రమం పేరిట ఇంటింటి సర్వే జరిగింది. శాంతినగర్, రాణివనం ప్రాంతాల్లో కొనసాగిన ఈ సర్వేను జిల్లా అదనపు వైద్యాధికారి ఖాదర్ వల్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన ఈ సర్వే డిసెంబర్ 5 వరకు కొనసాగుతుందన్నారు. ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కుష్టువ్యాధికి సంబందించి పొడలు ఎవరికైనా ఉన్నాయా అని పరిశీలిస్తారని అనుమానిత కేసులను వైద్యుల ద్వారా పరీక్షించి చికిత్స చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పద్మావతి, జ్యోత్న్ప, ఫిజియో థెరపీ మనోహర్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్లు ఓబులేసు, లక్ష్మీదేవితో పాటు మస్తాన్, జయపాల్, రాజసులోచన, అనిత, వినయ్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.