ప్రతి ఒక్కరూ గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సింహాద్రిపురం మండల తహశీల్దా ర్ మహబూబ్బాషా కోరారు. సింహాద్రిపురం గ్రంథాలయంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని లైబ్రేరి యన్ వరలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శననను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం ఒక పుస్తక భాండాగారమని, ప్రతి ఒక్క విద్యార్థి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. పుస్తక పఠనం ప్రతి ఒక్కరినీ మంచి. మార్గంలో నడిపి మంచి ప్రవర్తనను తీసుకువస్తుందని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు దిశా చట్టం పైన వకృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.