వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత పట్టాభిరామ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్న ఆయన వ్యాఖ్యలపై విజయసాయి మండిపడ్డారు. "ఒరేయ్ 'పొట్టా'భి! నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదురా! గతంలో ఇలా మాట్లాడే మాల్దీవ్స్ పారిపోవాల్సి వచ్చింది. నీకు దేవుడు దున్నపోతులా శరీరాన్నిచ్చాడు కానీ అందులో ఆవగింజంత కూడా మెదడు పెట్టడం మర్చిపోయాడురా." అంటూ ట్వీట్ చేశారు.